పెకురా నాంద్ - యువ స్వరం | సంపాదకీయం 3
- Dhaatri
- Apr 30
- 1 min read
మా పత్రిక గత సంపాదకీయంలో, తెలంగాణ మరియు మధ్య ప్రదేశ్ లో మేము ఆదివాసీ సమూహాలతో చేసిన పనిని గురించి పంచుకున్నాము. ఇప్పుడు, కొన్ని నెలలుగా మేము గిరిజన సమూహాలతో పని చేస్తున్న కార్యక్రమాల గురించి మా మూడవ సంపాదకీయం ద్వారా మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాము. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరియు మధ్య ప్రదేశ్ లోని గంజ్ బసోదలో ఆదివాసీ సమూహాలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాము. మేము పిల్లలు మరియు యువతకు విద్యా హక్కు కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, యువతకు భూమి మరియు అటవీ హక్కుల గురించి అవగాహన కల్పించడం మరియు మౌలిక సదుపాయాల కోసం స్థానిక ప్రభుత్వానికి అర్జీలు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసాము. అంతే కాకుండా, ఆదివాసీలు వైభవంగా జరుపుకునే పండుగలను మరియు సాంప్రదాయాలను గురించి రాసే ప్రయత్నం చేసాము.